Breaking News

నేను సోషల్‌ డాక్టర్‌! : సీఎం రేవంత్‌

Published on Sun, 01/11/2026 - 01:20

సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్లు కేవలం వైద్య నిపుణులే కాదు.. సమాజానికి దిక్సూచి వంటివారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘నేను డాక్టర్‌ను కాదు.. కానీ సోషల్‌ డాక్టర్‌ను. ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో శనివారం ఫెలోస్‌ ఇండియా సదస్సులో భాగంగా ఇంటర్నేషనల్‌ కార్డియాలజీ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఫౌండేషన్‌ (ఐసీఆర్‌టీఎఫ్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రేవంత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి వైద్య సదస్సును నిర్వహించడం గర్వకారణమని చెప్పారు. ఈ సదస్సుకు భారత్‌తోపాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు హాజరుకావడాన్ని ఆయన అభినందించారు. 

ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌ కార్డియాలజిస్టులైన డాక్టర్లు కూడా జ్ఞానం, నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ఈ సదస్సుకు రావడం అభినందనీయమన్నారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని, కొత్త విషయాలు తెలుసుకోవడం, స్కిల్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం మానేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్టేనని పేర్కొన్నారు. సాంకేతికత అతివేగంగా మారుతున్న నేపథ్యంలో వైద్య రంగం కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి వాటితో ముడిపడుతోందన్నారు. అందుకే ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అయితే, ప్రజల నాడి పట్టుకోవడాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దని హితవు పలికారు.  

హెల్త్‌కేర్‌ హబ్‌గా హైదరాబాద్‌ 
లైఫ్‌ సైన్సెస్, ఫార్మా, హెల్త్‌ కేర్‌ అనుబంధ రంగాల్లో హైదరాబాద్‌ ఆవిష్కరణల కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డాక్టర్లు కావాలని చాలామంది ఆశపడతారని, కానీ అందరికీ ఆ అవకాశం దక్కదని చెప్పారు. అందుకే డాక్టర్లు సమాజంలో ఒక ప్రత్యేక వర్గమని, ప్రజల ప్రాణాలు కాపాడే గొప్ప బాధ్యత మీపైన ఉందని గుర్తుచేశారు. ప్రజా ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం హెల్త్‌ పాలసీలను మెరుగుపరచడంలో వైద్యుల సహకారం కీలకమని, మీ సలహాలు, సూచనలతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.  

గుండె జబ్బులపై అవగాహన కల్పిస్తే... 
ఇటీవలి కాలంలో గుండె జబ్బులతో మరణాలు పెరుగుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గుండె జబ్బులను నివారించే మిషన్‌లో అందరూ భాగస్వాములవ్వాలని వైద్యులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు సీపీఆర్‌ శిక్షణను స్వచ్ఛందంగా అందించేందుకు కార్డియాలజిస్టులు ముందుకొస్తే అనేక ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. చాలా సందర్భాల్లో నివారణపై నిర్లక్ష్యం చేస్తామని, కానీ ప్రజలకు అవగాహన కల్పిస్తే సమాజం మొత్తంగా లాభపడుతుందన్నారు. 

క్వాలిటీ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ విషయంలో అందరూ కృషి చేయాలని, ఆరోగ్య సంరక్షణలో భారత్‌.. వరల్డ్‌ బెస్ట్‌గా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతీ వైద్యుడు ఉత్తమంగా ఎదగాలన్నదే తన కోరికని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెలోస్‌ ఇండియా ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ కుమార్, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ డాక్టర్‌ శరత్‌ రెడ్డి, మెడికవర్‌ సీఎండీ డాక్టర్‌ అనిల్‌ కృష్ణ, మెడికవర్‌ సీఈవో డాక్టర్‌ హరికృష్ణ, మాజీ సీఎస్‌ఐ అధ్యక్షుడు పీసీ రథ్‌ పాల్గొన్నారు.   

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు