Breaking News

కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

Published on Sat, 01/17/2026 - 18:07

సాక్షి, మహబూబ్‌నగర్‌: బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు జిల్లాకు అన్యాయం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను కేసీఆర్‌ వివక్షతో చూశారని.. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పాలమూరులోని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదంటూ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ చేతకానితనాన్ని కాపాడుకునేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు జిల్లాలో ఒక్కటైనా ఉందా? అంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌ విసిరారు.

సంగబండ పగలగొట్టేందుకు రూ.10 కోట్లు కూడా ఇవ్వలేదు. గత పాలకులు పదేళ్లు పాలమూరుకు అన్యాయం చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చించమంటే ముఖం చాటేశారు. త్వరలోనే తెలంగాణకు ఐఐఎం కోసం ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రధాని మోదీని కలుస్తాం.. ఐఐఎంను కూడా పాలమూరులోనే పెడతాం.. ‘‘మా ఎంపీ డీకే అరుణను ఓడించాలని నేను 14 మీటింగులు పెట్టిన.. కానీ ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు.. పాలమూరు అభివృద్ధికి కలిసి పోతాం. విమర్శలు వస్తుంటాయి.

..దేశ ప్రధానిగా మోదీని అభివృద్ధి కోసం కలుస్తాం.. ఎన్నికలప్పుడు బరాబర్ కొట్లాడతాం. వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ వారిని గెలిపించండి. అందరం కలిసి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth: పాలమూరుకు అన్యాయం BRS పాలనలోనే!

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)