Breaking News

గ్యారంటీల అమలు జాడేదీ?

Published on Mon, 04/15/2024 - 03:23

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గ్యారంటీల అమలు జాడలేకుండా పోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరిట 16 రకాల హామీల ను అమలు చేస్తామని గద్దెనెక్కి.. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త గ్యారంటీల నాటకాన్ని ఆడు తోందని దుయ్యబట్టారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ సంకల్పపత్రాన్ని విడుదల చేసిందని వివరించారు.

రానున్న ఐదేళ్లలో పేదలు, మహిళలు, యువకులు, రైతుల అభ్యున్నతిపై బీజేపీ దృష్టి సారించిందన్నారు. మరో ఐదేళ్ల పాటు ప్రజలకు ఉచిత రేషన్‌ బియ్యాన్ని అందిస్తామని, తెల్లరేషన్‌ కార్డు లేని మధ్య తరగతికి చెందిన సీనియర్‌ సిటిజన్లకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద వైద్యం అందిస్తామని వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో 3 కోట్ల ఇళ్లను పేదలకు నిర్మించి ఇస్తామని, మహిళలకు 33% రిజర్వేషన్‌ అందించాలని చట్టం చేశామని చెప్పారు.

జనగణన పూర్తయ్యాక దీన్ని అమలుచేస్తామన్నారు. వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ మాదిరిగా వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ అవసరమన్నారు. బీజేపీ సంకల్ప పత్రంపై మాట్లాడే దమ్ము రాహుల్‌ గాంధీకి, రేవంత్‌కు లేదన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ఇతర అంశాపై విమర్శించాలన్నారు. 

నేడు కిషన్‌రెడ్డి రైతు దీక్ష: కాంగ్రెస్‌ గ్యారంటీలతో రైతులు అన్యాయానికి గురయ్యారని, వారికి న్యాయం చేసేందుకు బీజేపీ కార్యాలయంలో సోమవారం రైతు దీక్ష చేపడతామని తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక, అంతకుముందు అన్ని రంగాల్లో దేశం పరిస్థితి ఎలా ఉందనే అంశంపై రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు ఎవరితోనైనా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)