నేడు కాంగ్రెస్‌ కీలక సమావేశం.. రేవంత్‌ ప్లానేంటి?

Published on Thu, 01/01/2026 - 08:12

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన నేడు కాంగ్రెస్‌ కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రజాభవన్‌ వేదికగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఆరోపణలపై చర్చ, నీటి కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది.

వివరాల మేరకు.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కాంగ్రెస్‌ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, కార్పోరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు వారికి ఆహ్వానం అందింది.

ఈ సమావేశంలో కృష్ణ-గోదావరి నదీజలాల నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే, నీటి కేటాయింపులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2014 నుంచి నేటి వరకు కృష్ణా-గోదావరి నదిలో నీటి కేటాయింపులు , బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ అవగాహన కల్పించనున్నారు. రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సమావేశంలో అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. 
 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)