Breaking News

Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్‌ పింఛనెంత?

Published on Mon, 02/24/2025 - 12:27

న్యూఢిల్లీ: మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎ‍న్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని సాధించి, మహిళా నేత రేఖా గుప్తా(Rekha Gupta)ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఫిబ్రవరి 24న ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ముందు ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రేఖా గుప్తా  త్వరత్వరగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా జీతం ఎంత? ఎన్నికల్లో ఓటమి పాలయిన కేజ్రీవాల్‌కు మాజీ సీఎంగా ఎంత పింఛన్‌ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతి నెలా రూ.1.70 లక్షల జీతం  అందుకోనున్నారు. ఈ మొత్తాన్ని 2023, మార్చి నాటి ఆర్డర్ ప్రకారం నిర్ణయించారు. దీనిలో ఆమె ప్రాథమిక జీతం(Basic salary) రూ. 60,000. వీటికితోడు ఆమెకు  పలు భత్యాలు కూడా లభిస్తాయి. వీటిలో రూ.30,000 అసెంబ్లీ భత్యం, రూ.25,000 సెక్రటేరియల్ సహాయం, రూ.10,000 టెలిఫోన్ భత్యం, రూ.10,000 ప్రయాణ భత్యం, రూ.1,500 దినసరి భత్యం  ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రికి జీతంతో పాటు  కారు, బంగ్లా సహా అనేక సౌకర్యాలు లభిస్తాయి. ముఖ్యమంత్రి తన ప్రైవేట్ కారును ఉపయోగిస్తే, ప్రతి నెలా రూ. 10,000 మొత్తం లభిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రభుత్వ నివాసానికి ప్రతి నెలా 5,000 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తారు. దీనికితోడు ముఖ్యమంత్రి తన పదవీకాలంలో రూ.12 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.

ఇప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు ఎంత పెన్షన్ వస్తుందనే విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యేల మాదిరిగానే ఆయనకు రూ. 15,000 పెన్షన్ మొత్తం లభిస్తుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిస్తే, ఈ మొత్తంపై వెయ్యి రూపాయలు పెరుగుతుంది. కేజ​్రీవాల్‌  మాజీ ముఖ్యమంత్రి అయినందున ప్రభుత్వ వసతి గృహం, ప్రభుత్వ కారు, డ్రైవర్ సేవలు లభిస్తాయి. దీనితో పాటు టెలిఫోన్, ఇంటర్నెట్, ప్రయాణ భత్యం, ఉచిత వైద్య సౌకర్యాలు కూడా లభిస్తాయి.

ఇది కూడా చదవండి: విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..

 

Videos

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేసిన బాబు

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

నర్సారెడ్డి వర్సెస్ మైనంపల్లి కుటుంబం.. మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)