Breaking News

kolkata: ‘ఎన్‌ఐఏ’ బృందంపై దాడి.. ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు

Published on Sat, 04/06/2024 - 16:18

కలకత్తా: పశ్చిమబెంగాల్‌ మేదినీపూర్‌లో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) పోలీసులపై శుక్రవారం(ఏప్రిల్‌ 5) అర్ధరాత్రి స్థానికులు ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన ఘటనపై సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ‘అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పాపెట్టకుండా వస్తే ఏం చేయాలో మేదినిపూర్‌ భూపతినగర్‌ వాసులు కూడా అదే చేశారు. అసలు అర్ధరాత్రి అక్కడికి వెళ్లేందుకు ఎన్‌ఐకు  అనుమతి ఉందా. ఎన్‌ఐఏకు ఏం అధికారం ఉందని ఇలాంటివి చేస్తున్నారు.

బీజేపీకి మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలపై అందరూ కలిసి పోరాడాలి’ అని మమత పిలుపునిచ్చారు. కాగా,2022 బాంబు పేలుడు కేసు దర్యాప్తు నిమిత్తం భూపతినగర్‌ వెళ్లిన ఎన్‌ఐఏ పోలీసులపై స్థానికులు మూకుమ్మడిగా దాడికి దిగారు. బాంబు పేలుడు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కలకత్తా వెళుతుండగా ఈ దాడి జరిగిందని ఎన్‌ఐఏ అధికారి ఒకరు తెలిపారు.

స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చిన తర్వాతే తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. ఎన్‌ఐఏ పోలీసులపై దాడి అత్యంత దారుణ ఘటన అని బెంగాల్‌ బీజేపీ ఖండించింది. ఇది తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాల పనేనని బీజేపీ నేతలు ఆరోపించారు. బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును తృణమూల్‌ అడ్డుకోవాలని చూస్తోందన్నారు. 

ఇదీ చదవండి.. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆ పార్టీకి కాపీ

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)