Breaking News

ఆర్‌జీ కార్‌ కేసు : సీఎం మమత బెనర్జీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Published on Mon, 08/26/2024 - 16:54

కోల్‌కతా: ఆర్‌జీకార్‌ ఆస్పత్రి ఉదంతం పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వైద్యురాలిపై జరిగిన దారుణానికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రజలు, వైద్యులు, న్యాయవాదులు చేస్తున్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రతిపక్షాలు సైతం దీదీ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. ఆ డిమాండ్‌పై టీఎంసీ నేతలు బీజేపీది పితృస్వామ్య పాలన అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీదీకి మద్దతుగా నిలుస్తున్నారు.    

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణాలు జరిగినప్పుడు ఇలాంటి డిమాండ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ‘ బీజేపీ నేతలు ముఖ్య మంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో చాలా దారుణాలే జరిగాయి. కానీ పశ్చిమబెంగాల్‌ సీఎంగా ఉన్న మమతా బెనర్జీనే ఎందుకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు’ అని పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రశ్నించారు. బీజేపీదీ పితృస్వామ్య పాలన ఇలాగే ఉంటుందని అన్నారు.  

రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ-ఏబీవీపీ పన్నాగం పన్నాయి. పోలీసు యూనిఫాంలో ఉన్న అనుమానితులు కాల్పులు జరిపేందుకు కుట్రపన్నారు. పరీక్షల సమయంలో ఇలాంటి ఆందోళనలు చేయమంటే చేస్తారా? అని భట్టాచార్య ప్రశ్నించారు. రాబందు రాజకీయాలతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతుంది’ అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  

అయితే టీఎంసీ నేతల వ్యాఖ్యల్ని బీజేపీ స్పందించింది. ర్యాలీలో ఎటువంటి ప్రమేయం లేదని ఖండించింది. తమ పార్టీ సభ్యులు ఏదైనా నిరసనలకు హాజరైతే, అది వారి వ్యక్తిగతంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)