Breaking News

కేటీఆర్‌కు కాంగ్రాట్స్‌.. తనయుడిని పొగిడిన కేసీఆర్‌

Published on Tue, 10/17/2023 - 17:42

సాక్షి, సిరిసిల్ల: తన జీవితంలో సిరిసిల్లాకు వందసార్లు వచ్చానని, ఇక్కడ తనకు బంధువర్గం ఎక్కువని సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో పర్యటించిన సీఎం.. ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కలలో ఊహించని అభివృద్ధి సిరిసిల్లలో జరిగిందని, వేసవిలో కూడా అప్పర్‌ మానేర్‌ ఉరకలేస్తోందన్నారు. అప్పర్‌ మానేరును చూస్తే ఆత్మ సంతృప్తి కలుగుతోందని కేసీఆర్‌ అన్నారు.

‘‘కేటీఆర్‌ ఎమ్మెల్యేగా ఉండటం సిరిసిల్ల అదృష్టం. చేనేత కార్మికుల అవసరాలన్నీ కేటీఆర్‌ తీర్చారు. చేనేతల బతుకులు మార్చిన కేటీఆర్‌కు అభినందనలు. సోలాపూర్‌ తరహాలో సిరిసిల్ల రూపుదిద్దుకోవాలి. చేనేతల కన్నీళ్లు తుడిచేందుకే బతుకమ్మ చీరలు తెచ్చాం. కొంతమంది దుర్మార్గులు చీరలను కాల్చేసి రాజకీయాలు చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఆసరా పింఛన్లను పెంచుకుంటూ వచ్చాం. తెలంగాణ రాష్ట్రం యావత్‌ దేశానికే అన్నం పెడుతోంది. వరిసాగులో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉంది. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వరి సాగువుతోంది. పేదల  కడుపునిండేలా సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించాం’’ అని సీఎం తెలిపారు.

మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి: కేటీఆర్‌
కలలో కూడా ఊహించని, కల్పన కూడా చేయని అభివృద్ధి ఇవాళ సిరిసిల్లలో కళ్లకు కనబడుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎర్రటి ఎండల్లో కూడా ఆప్పర్ మానేరు మత్తడి దూకుతోంది.. కన్నీరు చూసిన ఈ నేలలో కేసీఆర్ తాగు, సాగు నీరు అందుతోంది. ఇది చేతల,  నేతన్నల ప్రభుత్వం.. ఇవాళ సిరిసిల్ల జిల్లా కేంద్రమై లెక్కకు మిక్కిలి విద్యా, వైద్య సంస్థలతో సిరిసిల్ల తులతూగుతోంది.. సిరిసిల్లలో మరోసారి జై కొట్టి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపిస్తాం.. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.
చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్‌

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)