Breaking News

Maharashtra: ‘వారికి కాంగ్రెస్‌ ఓటు బ్యాంకే దిక్కు’

Published on Mon, 11/18/2024 - 07:35

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రచారంలో నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. తాజాగా సీఎం ఏక్‌నాథ్‌ షిండ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. తమకు శివసేన కార్యకర్తల ఓట్లు ఉండగా.. ఉద్ధవ్‌ థాక్రే వర్గం మాత్రం కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌పై ఆధారపడుతున్నారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాలక మహాయుతి కూటమిలో ఎలాంటి చీలికలు లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంపైనే మేము దృష్టి సారించాం. ఎన్నికల్లో​ తప్పకుండా విజయం సాధిస్తాం. శివసేనకు చెందిన బేస్‌ ఓటు బ్యాంక్‌ మాకు మద్దతుగా ఉన్నారు. కానీ, యూబీటీ చీఫ్‌ ఉద్దవ్‌ థాక్రేకు మాత్రం కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌పైనే వాళ్లు ఆధారపడుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) స్వల్ప విజయానికి సొంత బలం కంటే కాంగ్రెస్ మద్దతు వల్లే విజయం సాధించగలిగారు.

బాలాసాహెబ్ థాక్రే మహారాష్ట్రకు సైద్ధాంతిక మూలస్తంభం. ఉద్ధవ్ తన కుమారుడే అయినప్పటికీ, అతను కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా బాలాసాహెబ్ సిద్ధాంతాలను విడిచిపెట్టాడు. బాలాసాహెబ్ పార్టీతో ఎప్పుడూ సహవాసం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. శివసేన-బీజేపీ కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఉద్ధవ్ రాజీ పడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దవ్‌ ప్రయత్నిస్తున్నారు. బాలాసాహెబ్ పేరును ఉపయోగించుకునే అర్హత కూడా అతనికి లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది.


 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు