Breaking News

వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు

Published on Sat, 03/01/2025 - 21:10

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా ఇప్పటికే కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. ఈసారి ఏకంగా  ఆ పార్టీకి చెందిన వారికి ఏ పనులు చేయొద్దంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది.  వైఎస్సార్ సీపీకి చెందిన వారికి ఎటువంటి పనులు చేయొద్దని చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.  డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ పనులు చేయకండని, అన్ని స్థాయిల్లోనూ ఇది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. తన సొంత జిల్లా(చిత్తూరు జిల్లా) పర్యటనలో భాగంగా ప్రజా వేదిక పేరుతో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ఈ రకంగా కక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు. 
 

చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలు
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ తరహా కక్ష సాధింపు వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో పార్టీ రహితంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాలన అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం కక్ష పూరిత రాజకీయం కాకపోతే ఏంటని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.   సీఎంగా ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమైందని మండిపడుతున్నారు.   ఇది రాజ్యాంగానికి, సీఎం ప్రమాణానికి విరుద్ధమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)