Breaking News

రాళ్ల దాడులు.. పిడిగుద్దులు.. తమ్ముళ్ల డిష్యుం.. డిష్యుం!

Published on Wed, 05/01/2024 - 19:01

సాక్షి, నంద్యాల జిల్లా: డోన్‌లో కూటమి నేతలు కొట్లాటకు దిగారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. కోట్ల సూర్యప్రకాశ్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. చంద్రబాబు వచ్చి సర్ది చెప్పి పోయినా సొంత  క్యాడర్‌ సహకరించలేదు.

తాజాగా ప్యాపిలి మండలం పెద్దపూదెళ్లలో  తెలుగు తమ్ముళ్లు దారుణంగా తన్నుకున్నారు. 'కోట్ల' ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాన్వాయ్ ఎవరెక్కాలనేదానిపై ఘర్షణ మొదలైంది.రాళ్లదాడులు, పిడిగుద్దులతో  రెండు వర్గాలు విరుచుకుపడ్డాయి. సమన్వయం పాటించాలని కోట్ల సూర్యప్రకాశ్ కోరినా తెలుగు తమ్ముళ్లు లెక్కచేయలేదు. ‘కోట్ల’ చెప్పినా ఓ వర్గం మరింత రెచ్చిపోయి రాళ్లు రువ్వి దాడులకు దిగింది.

ముందే ప్లాన్ చేసి టీడీపీలోని ఓ వర్గం దాడికి పురిగొల్పినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు డోన్ బహిరంగ సభలో పదే పదే సుబ్బారెడ్డి పేరు పలకడంపైనా ఓ వర్గం తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'కోట్ల' కన్నా ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంపై కోట్ల వర్గం కూడా అసంతృప్తితో ఉంది.

టీడీపీకి వలసలుగా వెళ్లిన వారు కూడా ఎందుకొచ్చాం రా బాబూ అనుకునేలా కూటమిలో పరిస్థితి నెలకొంది. తమ్ముళ్ల బాహాబాహీతో తెలుగుదేశం బండారం బయటపడింది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)