Breaking News

టీడీపీ తరఫున లోకేశ్‌ పిటిషన్‌ ఎలా వేశారు?

Published on Fri, 02/02/2024 - 07:49

సాక్షి, హైదరాబాద్‌: ‘వ్యూహం చిత్రానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) కమిటీ జారీ చేసిన యు సర్టిఫికెట్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సింగిల్‌ జడ్జి విచారణ జరిపి తీర్పు ఇచ్చారు. ఇక్కడకు అప్పీల్‌ వచ్చింది.. సమాచారం ఇవ్వడానికి ఇంకా సమ­యం కావాలని కోరడం ఆమోదయోగ్యం కాదు..’ అంటూ టీడీపీ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

పార్టీ అధ్యక్షుడి(అచ్నెన్నాయుడు, ఏపీ) అనుమతి లేకుండా పిటి­షన్‌ వేయడానికి రిట్‌ పిటిషనర్‌(లోకేశ్‌)కు ఏం అధి­­కా­రం ఉందని ప్రశ్నించింది. ‘విచారణకు సిద్ధమై రావాలి కదా.. సబ్జెక్ట్‌పై వాస్తవాలు వెల్లడించండి. పార్టీ నిబంధనల ప్రకారం ఏపీ అధ్యక్షుడి అనుమతి ఎందుకు తీసుకోలేదు?’ అని మండిపడింది. శుక్రవారం వరకు సమయం కావాలని టీడీపీ న్యాయవాదులు అడగడాన్ని తప్పుబట్టింది.

వ్యూహం చిత్రానికి సీబీఎఫ్‌సీ ఇచ్చిన సర్టిఫికెట్‌ రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. నిర్మాత తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటేశ్‌ వాదనలు వినిపిస్తూ.. సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టివేసి, చిత్ర విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు పూర్తి కావడంతో ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)