Breaking News

బీజేపీకి షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రాహుల్‌ కుశ్వాన్‌

Published on Mon, 03/11/2024 - 14:44

జైపూర్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు పార్టీల మారుతూ సార్వత్రిక సమరాన్ని మరింత  ఆసక్తి రేపుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు బీజేపీలోకి.. బీజేపీ నేతలు కాంగ్రెస్‌లోకి వరుస కడుతున్నారు. తాజాగా రాజస్తాన్‌లోని చురూ సెగ్మెంట్‌కు చెందిన ఎంపీ బీజేపీకి షాక్‌ ఇచ్చారు. రాహుల్‌  కుశ్వాన్‌ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవకి రాజీనామా చేసి.. సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

‘నేను కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సహకరించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేత సొనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, గోవింద్‌ సింగ్‌ దోస్తారా,  ఇతర నేతలకు ధన్యవాదాలు’ అని కాంగ్రెస్‌ చేరిన అనంతరం  మీడియాతో  మాట్లాడారు. 

అంతకంటే ముందు.. ప్రజాజీవితంగా  గురించి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానని  రాహుల్‌ కుశ్వాన్‌  ‘ఎక్స్‌’(ట్వీటర్‌) వేదికగా వెల్లడించారు. ‘కొన్ని రాజకీయ  కారణాల రీత్యా ఈ రోజు కీలక పరిణామం జరగబోతుంది. నేను బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా  చేస్తున్నా. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నా’అని పేర్కొన్నారు.  

అదేవిధంగా చురూ నియోజకవర్గ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే లోక్‌సభలో ఎన్నికల్లో చురూ సెగ్మెంట్‌ నుంచి బీజేపీ టికెట్‌ తిరస్కరించిన నేపథ్యంలో రాహుల్‌ కుశ్వాన్‌  పార్టీ మారటం గమనార్హం. బీజేపీ మొదటి జాబితాలో చురూ లోక్‌సభ స్థానంలో రాహుల్‌ కుశ్వాన్‌ బదులు  పారా ఒలింపియన్ దేవేంద్ర ఝఝరియాను బరిలోకి దించిన విషయం తెలిసిందే.

చదవండి: డీప్‌ఫేక్ బారినపడ్డ యోగి ఆదిత్యనాథ్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)