Breaking News

వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా

Published on Sat, 09/02/2023 - 17:17

నయా రాయపూర్: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్ర మంత్రి అమిత్ షా పేరుతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతిని లక్ష్యం చేసుకుని 'ఆరోప్ పత్ర' పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ప్రభుత్వం కుంభకోణాలు, అవినీతిని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడుతోందని గాంధీ కుటుంబానికి ఏటీఎంలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మొత్తం అవినీతి రికార్డులన్నిటినీ బద్దలు కొట్టేసిందని ఏకరువు పెట్టారు.     

అదొక్కటే మార్గం.. 
అమిత్ షా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులను నిరోధించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. బొగ్గు, మద్యం, ఆన్‌లైన్ బెట్టింగులతో రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని కుంభకోణాలు, దౌర్జన్యాలు, పెట్రేగిపోతున్నాయని ఇక్కడ పరిస్థితి బాగుపడాలంటే అది ఒక్క బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని అన్నారు. 

డిసైడ్ చేసుకుని వార్ వన్‌సైడ్ చేయండి..  
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా జరిగిన కుంభకోణాల ప్రస్తావన తీసుసుకొస్తూ ఛత్తీస్‌గఢ్‌ యువతను ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసలుగా చేసే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా లేక వారిని బంగారు భవిష్యత్తు వైపుకు నడిపించే బీజేపీ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని.. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో..  అభివృద్ధికి బాటలు వేసే బీజేపీ ప్రభుత్వం కావాలో ఆలోచించుకొమ్మని.. గిరిజన సంస్కృతిని కాపాడే బీజేపీ కావాలో, మతమార్పుడులతో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే కాంగ్రెస్ కావాలో ఛత్తీస్‌గఢ్‌ ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు.   

వారిని వదిలిపెట్టం.. 
ఛత్తీస్‌గఢ్‌లో బాఘేల్ ప్రభుత్వం మొత్తం అవినీతి రికార్డులన్నిటినీ బద్దలుకొట్టేసిందని బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడ్డ పార్టీ ఒక్కరినీ తలకిందులుగా వేలాడదీసి గాడిలో పెడతామని అన్నారు. కేంద్రంలోనూ ఇక్కడా బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే కేవలం రెండేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని అన్నారు. 

ఇది కూడా చదవండి: 'ఇండియా' కూటమి తర్వాతి ప్రణాళిక అదుర్స్!!

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)