Breaking News

లోక్‌సభ బరిలో ఛత్రపతి శివాజీ వారసుడు..

Published on Wed, 03/06/2024 - 22:15

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఓ వైపు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తన సీట్ల షేరింగ్ ఫార్ములాను ఖరారు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మరోవైపు కాంగ్రెస్ మాత్రం రాజకుటుంబీకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు ఛత్రపతి షాహూ మహారాజ్‌ను కొల్హాపూర్ నుంచి అభ్యర్థిగా ప్రకటించింది.

కొల్హాపూర్ మాజీ రాజకుటుంబానికి అధిపతిగా ఛత్రపతి షాహూ మహారాజ్‌కు రాష్ట్రవ్యాప్తంగా అపారమైన గౌరవం ఉంది. రాజకీయంగా కాంగ్రెస్‌తో జతకట్టినప్పటికీ, 1998లో లోక్‌సభ ఎన్నికల్లో వైఫల్యం తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. కొల్హాపూర్‌ రాజర్షి ఛత్రపతి షాహు మనవడైన ఆయనకు మరాఠా ప్రజల్లో ఉన్న గుర్తింపు, స్థాయి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తుంది.

బీజేపీ మాజీ ఎంపి ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు తండ్రి ఛత్రపతి షాహూ మహారాజ్‌ మరాఠా సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి కూడా. 2023 జూన్‌లో జరిగిన మతపరమైన అల్లర్ల తరువాత, షాహూ ఛత్రపతి కొల్హాపూర్‌లో 'సద్భావన' ర్యాలీకి నాయకత్వం వహించారు.

కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఛత్రపతి షాహూ మహారాజ్‌ నిర్ణయించుకున్నారని ఆయన కుమారుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ తెలిపారు. తన తండ్రి ఇప్పటికే రేసులో ఉన్నందున తాను పోటీ నుంచి తప్పుకొన్నట్లు స్పష్టం చేసిన ఆయన.. తన తండ్రి విజయానికి సహకరించాలని కార్యకర్తలను కోరారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)