Breaking News

నోటీసు ఇవ్వకుండానే నన్ను అరెస్ట్‌ చేశారు: చెవిరెడ్డి

Published on Wed, 06/18/2025 - 16:47

సాక్షి, విజయవాడ: పోలీసులు తీరుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిస్‌ ఇవ్వకుండానే తనను అరెస్ట్‌ చేశారంటూ మండిపడ్డారు. నిన్న(మంగళవారం) ఆయన రాసిన లేఖ వైరల్‌గా మారింది.

‘‘నిన్నటి వరకు నాపై ఎఫ్‌ఐఆర్‌ కూడా లేదు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పా. లుకౌట్‌ నోటీసులు ఎందుకిచ్చారో తెలియదు. విచారణలో కనీసం నా అభిప్రాయం కూడా తీసుకోలేదు. తప్పుడు కేసులను ఎదుర్కొంటా’’ అని చెవిరెడ్డి పేర్కొన్నారు.

కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మా అన్నపై మొదట హత్య కేసు పెట్టారు. మా నాన్నపై ఫాక్సో కేసు పెట్టారు. కేసుల పేరుతో లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు’’ అని హర్షిత్‌రెడ్డి  పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం.

..మా వ్యాపార పనుల రీత్యా విదేశాలకు వెళ్తుంటే పారిపోతున్నామని ప్రచారం చేస్తున్నారు. మా పై పెట్టిన అక్రమ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మా అన్నపై కేసు పెట్టారు.. మా నాన్నపై కేసు పెట్టారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం. మాపై కేసులు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం’’ అని హర్షిత్‌రెడ్డి చెప్పారు.

FIR కూడా లేకుండా అరెస్టు.. పోలీసుల తీరుపై చెవిరెడ్డి ఫైర్

కాగా.. నిబద్ధత, నిజాయితీ, పారదర్వకత అంటూ లేఖ రాసిన సిట్‌ అధికారులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి లేఖ ద్వారా ప్రశ్నించారు. ఒక్క ఏడాది కాలంగా విచారణ చేస్తున్న సిట్‌ అధికారులు.. ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి  రాజ్‌ కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని కానీ ప్రజలకు పంచారని కానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటి?. అది నిజం కాదు కనకే కదా? అంటూ ఆయన ప్రశ్నించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)