Breaking News

కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌.. నో ఇంట్రెస్ట్‌?

Published on Mon, 08/28/2023 - 09:29

సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే.. వేములవాడలో రాజకీయాలు కాస్త ప్రత్యేకంగా సాగుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబును బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పక్కనపెట్టేయడంతో.. ఆయన నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం అపాయింట్ మెంట్ దక్కినా చెన్నమనేని కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది.  

సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు కాకుండా.. చల్మెడ లక్ష్మీనరసింహారావుకు వేములవాడ టికెట్‌ కేటాయించింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం. చెన్నమనేని మంచి లీడర్‌ అని, కానీ, పౌరసత్వ వివాదం ఉన్నందునే ఆయన పక్కకి పెడుతున్నట్లు ఆవేదనపూరితంగానే కేసీఆర్‌ మీడియా ముందు ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగ సలహాదారుగా చెన్నమనేనిని నియమించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. 

అయితే టికెట్‌ ఇవ్వకపోవడంతో పాటు ఈ నియామకంగాపై చెన్నమనేని తీవ్ర అసంతృప్తితో రలిగిపోతున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఇవ్వకపోవడంపై నిరసన తెలిపే క్రమంలోనే ఆయన అపాయింట్‌మెంట్‌ ఇచ్చినా వెళ్లలేదని స్పష్టమవుతోంది. 

చల్మెడకు నో సపోర్ట్‌!
వేములవాడలో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ రాజకీయం గందరగోళంగా తయారైంది. టికెట్‌ ప్రకటన తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయాయి బీఆర్‌ఎస్‌ శ్రేణులు. ఇక తమ రాజకీయ వారసత్వానికి గండి పడటాన్ని జీర్ణించుకోలేని స్థితిలో చెన్నమనేని ఉన్నారు. అదే సమయంలో చెల్మెడ్‌కు మద్దతుగా వచ్చిన నాయకులపైనా ఆయన రుసరుసలాడినట్లు తెలుస్తోంది.

మీరు చేస్తున్న బ్యాక్‌ డోర్‌ పాలిటిక్స్‌తో ప్రత్యర్థి పార్టీ నాయకుడి గెలుపు ఖాయం అంటూ చెన్నమనేని తనను కలిసేందుకు వచ్చిన నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థి చల్మెడకు అంతగా మద్దతు దొరకడం లేదు. మరోవైపు రమేష్ బాబుకు పార్టీకి మించిన మద్దతు ఉందక్కడ. ఈ నేపథ్యంలో.. చెన్నమనేని తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)