Breaking News

రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసింది: మంత్రి చెల్లుబోయిన

Published on Sat, 10/21/2023 - 11:29

సాక్షి, తూర్పు గోదావరి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను టీడీపీ ఒక వస్తువుగా వాడుకుంటోందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు శకం ముగిసింది వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై పవన్‌ ఆ‍త్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 

కాగా, మంత్రి చెల్లుబోయిన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్‌ రాజకీయ విలువలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సంకేతం. పవన్‌ను టీడీపీ ఒక వస్తువుగా వాడుకుంటోంది. కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ ప్రయత్నం చేస్తున్నారు. ముద్రగడను చంద్రబాబు తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారు. మరోసారి కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు మోసానికి కాపులు నష్టపోతారని పవన్ గ్రహించాలి

రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసింది. చంద్రబాబు చట్టాలకు అతీతుడనుకుంటున్నాడు. దేశంలో చట్టాలు తనకు వర్తించవనే భ్రమలో ఉన్నారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబుకు నేడు బెయిల్ రావడం లేదు. చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. టీడీపీ, జనసేన ఇద్దరే కాదు ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్‌న ఏమీ చేయలేరు. జనం మనసులో జగనన్న ఉన్నాడు.. సీఎం జగన్ మనసులో జనం ఉన్నారు. జగన్, జనం బంధాన్ని ఎవరూ విడదయలేరు’ అని అన్నారు. 

ఇది కూడా చదవండి: ‘మాధవీరెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. విమర్శిస్తే సహించం’

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)