Breaking News

‘ముందు హామీ ఇచ్చి.. తర్వాత మీతో పనిలేదన్నారు’

Published on Tue, 04/08/2025 - 17:12

తాడేపల్లి:  వాలంటీర్లీ వ్యవస్థను కొనసాగిస్తామని గతేడాది ఉగాది సందర్భంగా హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు.. గెలిచిన తర్వాత వారితో పని లేదని పక్కన పెట్టేశారని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్ల వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ జగన్ 2 లక్షల 66 వేల మందితో వాలంటీర్ వ్యవస్థ తెచ్చారు. ప్రజలకు ఇంటివద్దకే సేవలు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకలా వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారు వాలంటీర్లకు 5వేలు కాదు 10 వేలిస్తామన్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామని గత ఉగాది రోజు చంద్రబాబు మాటిచ్చి...ఇప్పుడు మాటమార్చేశారు

విజయవాడ వరదల్లో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకున్నారు. వరద తగ్గాక మీతో మాకు పనిలేదన్నారు. ప్రభుత్వం నుంచి వాలంటీర్లకు వేతనాలివ్వలేదని వైఎస్సార్‌సీపీపై నిందలు వేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థకు ఎలాంటి ఆధారాల్లేవని పవన్ మాట్లాడటం విడ్డూరం. ప్రభుత్వం వాలంటీర్లకు వేతనాలిచ్చిన సంగతి కూడా ఒక మంత్రిగా పవన్ కు తెలియదా?, వాలంటీర్ల నియామకం పై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎంత వేతనమివ్వాలో కూడా స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎంగా ఉండి కూడా పవన్ అబద్ధాలాడటం హాస్యాస్పదం. దేశంలో ఎక్కడాలేని విధంగా వాలంటీర్ వ్యవస్థను జగన్ తెచ్చారు. కోవిడ్ సమయంలో వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి వాలంటీర్ల పై చంద్రబాబు, పవన్, టీడీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే. వాలంటీర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. 10 వేల వేతనం ఇచ్చితీరాల్సిందే. పవన్ ను కలిసేందుకు వాలంటీర్లు వెళితే పోలీసులను పెట్టి జులుం ప్రదర్శించారు

వాలంటీర్లకు ఏం చేయలేకపోతే....చేయలేమని చెప్పండి. మీ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైనా పీఆర్సి ప్రకటించలేదు. ప్రభుత్వం రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పారు. ఐఆర్ కోసం ఉద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగులకు జాబ్  ఇస్తామన్నారు..ఏమైంది జాబ్ క్యాలెండర్

ప్రైవేట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయలేదు. ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. రాబోయే క్యాబినెట్ లో పెండింగ్ డీఏ , పీఆర్సీ,ఐఆర్ పై ప్రకటన చేయాలి’ అని డిమాండ్ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)