Breaking News

టీడీపీ తొలి జాబితా: విజయనగరంలో ‘కిమిడి’ వర్గానికి షాక్‌

Published on Sat, 02/24/2024 - 12:58

సాక్షి,విజయనగరం: తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో జాబితాలో జిల్లాకు చెందిన  టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వర్గానికి చంద్రబాబు షాకిచ్చారు. జాబితాలో కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. రాజాంలో కొండ్రు మురళిని వ్యతిరేకించి  కళా వెంకట్రావు భంగపడ్డట్లు తెలుస్తోంది.  

టీడీపీ రాజాం టికెట్‌ను మాత్రం కొండ్రు మురళీమోహన్ సాధించుకున్నారు. జిల్లాలోని చీపురుపల్లి సెగ్మెంట్‌లోనూ కిమిడి కళా వెంకటరావు తమ్ముడి కుమారుడు కిమిడి నాగార్జునను టీడీపీ అధిష్టానం పక్కనపెట్టడంపై కిమిడి వర్గం నేతలు పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కిమిడి వర్గం నేతలుగా ముద్ర పడ్డ ఎవరికీ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంపై ఆయన క్యాడర్‌ మొత్తం టీడీపీ పెద్దలపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.  

కాగా, తొలి జాబితాలో జిల్లాలోని గజపతినగరం టీడీపీ టికెట్‌ కొండపల్లి శ్రీనివాస్‌కు దక్కింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడును టీడీపీ హై కమాండ్‌ పక్కన పెట్టింది. అధిష్టానం తీరుతో అప్పలనాయుడు వర్గం భగ్గుమంటోంది. జిల్లాలోని నెల్లిమర్ల స్థానం జనసేనకు కేటాయించడంపై టీడీపీ శశ్రేణులు భగ్గుమంటున్నారు. ఇక్కడ టికెట్‌ ఆశించిన టీడీపీ నేత శివరామకృష్ణ ఆశాభంగం చెందారు. జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామికి కూడా తొలిజాబితాలో చోటు దక్కలేదు. 

ఇదీ చదవండి.. టీడీపీ, జనసేన ఫస్ట్‌ లిస్ట్‌ పావలా వంతు కూడా ఇవ్వలేదు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)