Breaking News

తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఎదురుదెబ్బ

Published on Tue, 10/28/2025 - 08:43

సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. మరో ఏడాది పాటు తాడిపత్రి ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి కొనసాగనున్నారు. ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి ట్రైనింగ్ ప్రొగ్రామ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. నవంబర్ 10 నుంచి జనవరి 2026 దాకా రోహిత్.. శిక్షణకు వెళ్లాల్సి ఉంది.

ఐపీఎస్ రోహిత్ కుమార్ చౌదరిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పీఎస్ రోహిత్ ను వెంటనే బదిలీ చేయాలని చంద్రబాబు సర్కార్‌పై జేసీ ఒత్తిడి చేశారు. ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరిని మరో ఏడాది తాడిపత్రి ఏఎస్పీ గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ‘రేయ్‌.. నా కొడల్లారా.. ఏమనుకుంటున్నారు. మీ ఇళ్ల వద్దకు వస్తా. ఏమనుకుంటున్నారో. ఒక్కో నా కొడుకు ఇష్టారాజ్యంగా రాస్తారా. నాకు గన్‌మెన్లు తొలగిస్తున్నారని సోషల్‌ మీడియాలో పెడతారా.. ఒక్కో  యూట్యూబ్‌ నా కొడుక్కి చెబుతున్నా జాగ్రత్త’’ అంటూ గత గురువారం (అక్టోబర్‌ 23) మరోసారి జేసీ ప్రభాకర్‌రెడ్డి బూతులతో రెచ్చిపోయారు. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజున ఏఎస్పీ రోహిత్‌ చౌదరిని దుర్భాషలాడటంతోపాటు ఏఎస్పీగా పనికిరాడంటూ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానిం చడం, దీనికి చట్టపరమైన చర్యలు తప్పవంటూ ఎస్పీ జగదీష్‌ అదే రీతిలో స్పందించడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గురువారం తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎస్పీ జగదీష్‌ను కలిసేందుకు అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంటకుపైగా వేచి ఉన్నా.. ఎస్పీ జగదీష్‌ ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వెనుతిరిగారు. ఈ సమయంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై జేసీ బూతులు లంకించుకున్నారు. అంతుచూస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

నేను చదువుకున్న వాన్ని.. మా తాతల కాలం నుంచి రాజకీయం చేస్తున్నాం అంటూ మాట్లాడే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనాగరికంగా మాట్లాడుతున్న మాటలు చూసి జిల్లా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. అధికారపార్టీలో ఉన్నా.. చివరుకు జిల్లా ఎస్పీ కూడా కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటే జేసీకి ఉన్న విలువ ఏపాటిదో అన్నది అర్థం కావడం లేదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)