Breaking News

వాలంటీర్లకి చంద్రబాబు మార్క్ వెన్నుపోటు.. వైఎస్సార్‌సీపీ

Published on Mon, 06/24/2024 - 16:00

సాక్షి, విజయవాడ: వాలంటీర్లపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెడుతూ.. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయించాలని నిర్ణయించింది. 1వ తేదీన సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ డోర్ డెలివరీ చేయనుంది. అన్ని రకాల పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయనున్నామని.. వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్థసారథి తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వం తీరుపై వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. ‘‘జులై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ.. రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా చంద్రబాబు సర్కార్‌ నిర్ణయాలు తీసుకుంటుంది’’ అని వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది.

 కాగా, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సేవ కంటే కక్షసాధింపునకే ప్రాధాన్యం ఇస్తోంది. వెలకట్టలేని అభిమానంతో గత ప్రభుత్వంలో జగనన్న సైన్యంలా వలంటీర్లు పని చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్లుగా పనిచేసి వారిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ క్రీడకు తెరతీసింది చంద్రబాబు సర్కార్‌.

 

వలంటీర్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికీ అందేలా, ఇంటింటికి వెళ్లి అందించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు.

వాలంటీర్లకు షాకిచ్చిన ఏపీ కేబినెట్..
 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)