Breaking News

మహాసేన రాజేష్‌కు చంద్రబాబు వెన్నుపోటు

Published on Sat, 03/23/2024 - 18:06

సాక్షి, విజయవాడ: చంద్రబాబు అంటే  వెన్నుపోటు.. వెన్నుపోటు అంటే చంద్రబాబు.. ఎన్నికల సమయంలో బాబు వెన్నుపోటు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. తాజాగా టికెట్‌ విషయంలో మహాసేన రాజేష్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. పి.గన్నవరం టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వ్యతిరేకత పేరుతో జనసేనకి సీటు కేటాయించారు. పి.గన్నవరం నియోజకవర్గం నుండి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు టికెట్‌ ఇచ్చారు. విజయవాడలో పి.గన్నవరం సీటును జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

మొదట పి.గన్నవరం సీటు టీడీపీకి టికెట్‌ కేటాయించారు. పి.గన్నవరంలో మహాసేన రాజేష్‌ను‌ చంద్రబాబు  ప్రకటించారు. మహాసేన‌ రాజేష్ అభ్యర్దిత్వాన్ని  స్ధానిక జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. మహాసేన రాజేష్‌ను పి.గన్మవరంలో‌ పర్యటించకుండా జనసేన నేతలు అడ్డుకున్నారు. మహాసేన రాజేష్‌కు టికెట్ ఇవ్వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేశాయి. వ్యతిరేకత, ఆందోళనల నేపధ్యంలో పి.గన్నవరం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్ ప్రకటన చేశారు.

కొన్ని రోజుల తర్వాత పి.గన్నవరం నుంచే పోటీకి దిగుతానని మహాసేన రాజేష్ మళ్లీ ప్రకటన చేశారు. ఇదే సమయంలో మహాసేన రాజేష్‌కు వెన్నుపోటు పొడిచి పి.గన్నవరం టికెట్‌ జనసేన‌ పార్టీకి కేటాయించారు చంద్రబాబు. మహాసేన రాజేష్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించిన గిడ్డి సత్యనారాయణకే  జనసేన‌ నుంచి పి.గన్నవరం టికెట్  పవన్ కల్యాణ్ ఇచ్చారు. సత్యనారాయణకి నియామక పత్రాలు పవన్ కల్యాణ్ అందించారు. 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)