Breaking News

కిరాయిలు ఇవ్వకుంటే ఎలా బాబూ!

Published on Sat, 02/03/2024 - 07:42

హుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): చంద్రబాబు సభకు ఆటోల్లో ప్రజలను తరలించిన  డ్రైవర్లకు కిరాయి డబ్బులు చెల్లించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టారు.  టీడీపీ నేతల తీరును నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా బాకురులో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. బాకూరు, ఉప్ప, చీకుమద్దుల, అండిభ, పంచాయతీల పరిధిలోని ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. గతల నెల 20న అరకులో జరిగిన ‘రా కదలి రా’ సభకు జనాలను తరలించేందుకు ఒక్కొక్క ఆటోకు రూ.2,500 ఇస్తామని నేతలు ఒప్పందం చేసుకున్నారు.

అయితే, ముందుగా కొంతమందికి మాత్రమే రూ.500 అడ్వాన్స్‌ ఇచ్చారని, మరికొందరికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఒకేసారి ఇస్తామంటూ ఆటోలను సభకు తరలించారని పలువురు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేశారు. బాకురు, అండిభ యూనియన్ల పరిధిలో సుమారు 60 ఆటోలు, ఉప్ప ప్రాంత యూనియన్‌ నుంచి సుమారు 50 ఆటోలను మొత్తం 110 ఆటోల్లో ప్రజలను సభకు తీసుకువెళ్లామని వాపోయారు.

సభ జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తమకు  కిరాయిలు చెల్లించకుండా టీడీపీ నేతలు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. సభ జరిగే రోజు తమ ప్రాంతంలో సంత ఉంటుందని చంద్రబాబు సభకు వెళ్లకుండా  అక్కడే టికెట్‌ సరీ్వసు చేసుకుంటే సుమారు రూ.3వేల వరకు సంపాదించుకుని ఉండేవారమని వారు లబోదిబోమంటున్నారు. కిరాయిలు ఇవ్వకపోతే ఓట్ల కోసం తమ గ్రామాలకు వచ్చే టీడీపీ నాయకులను అడ్డుకుంటామని 
హెచ్చరించారు.  

ఊరుకునేది లేదు.. 
రోజు మా కుటుంబ పోషణ నిమిత్తం ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. కిరాయి డబ్బులు ఇస్తామని చంద్రబాబు సభకు తీసుకువెళ్లారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుతిరుగుతున్నారు. కిరాయి డబ్బులు చెల్లించకపోతే ఊరుకొనేది లేదు. 
– దూసురు వెంకట రమణ,ఆటో యూనియన్‌ అధ్యక్షుడు, అండిభ, హుకుంపేట మండలం 


మా పొట్ట కొడితే ఎలా? 
నాది పేద కుటుంబం. అమ్మా నాన్న కూలి చేస్తేనే తప్ప కడుపు నిండదు. రోజు ఎంతో కష్టపడితే గాని నాలుగు వేళ్లు నోటికి వెళ్లవు. ఆటో ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాం. సభలకు జనాలను తరలించేటప్పుడు అడ్వాన్సులు అడిగితే అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామంటూ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.   
– సంతోష్, ఆటో డ్రైవర్, చట్రాయిపుట్టు
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు