Breaking News

జార్ఖండ్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. బీజేపీలోకి చంపై సోరెన్‌?

Published on Sun, 08/18/2024 - 12:44

రాంచీ: మరికొన్ని రోజుల్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో భారీ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రాజకీయ సంక్షోభం దిశగా జార్ఖండ్‌లో పరిణామాలు వేగంగా కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపై సోరెన్‌ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు ఎమ్మెల్యేలతో చంపై ఢిల్లీ చేరుకున్నట్లు జాతీయ మీడియా వార్తలు వెల్లడిస్తోంది. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలుస్తోంది. 

మరోవైపు.. ఢిల్లీకి చేరుకున్న చంపై సోరెన్‌ను బీజేపీ నేత సువేందు అధికారిని కలిశారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘నేను ఎవరినీ కలవలేదు. వ్యక్తిగత పని కోసం ఇక్కడకు వచ్చాను’ అని అన్నారు.

 

ప్రస్తుతం సీఎం హేమంత్‌ సోరెన్‌ కేబినెట్‌లో చంపై మంత్రిగా ఉ‍న్నారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరి 31న అరెస్టు చేయగా.. అనంతరం చంపై సోరెన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంపై సోరెన్ జూలై 3న  ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఇక.. హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంపై సోరెన్ సంతోషంగా లేరని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. జార్ఖండ్‌ మొత్తం 81 స్థానాలకు గాను అధికార జేఎంఎంకు 45 సీట్లు, ప్రతికక్షాలకు 30 సీట్లు ఉన్నాయి. 
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)