పవన్‌ను ప్రశ్నిస్తున్నా.. కూటమి ఎంపీలకు సిగ్గులేదా?: చలసాని

Published on Sun, 02/02/2025 - 12:37

సాక్షి, విజయవాడ: ఆంధ్రుల జీవ నాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. గతంలో ఎంపీలంతా ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇప్పుడు పవన్‌ను మేము ప్రశ్నిస్తున్నాం.. కూటమి ఎంపీలకు సిగ్గు, శరం లేదా?. కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలుగు వారి ఆత్మగౌరవం మరో మారు ఢిల్లీలో తాకట్టుపెట్టారు. ఆంధ్రుల జీవ నాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోంది. 41.5 ఎత్తులో మీటర్లకు నీటిని పరిమితం చేయడం అన్యాయం. 155 అడుగుల ఎత్తున నీటి నిల్వ ఉంటేనే ప్రాజెక్టు ప్రయోజనం ఉంటుంది. ఎంపీలంతా ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గతంలో ప్రశ్నించారు. పవన్‌ను మేం ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం.. కూటమి ఎంపీలకు సిగ్గు, శరం లేదా?.

వైఎస్‌ జగన్ కేంద్రం ఒత్తిడికి తలొంచి ఉంటే 12,500 కోట్లు పోలవరానికి ఎప్పుడో వచ్చేవి. కానీ, పోలవరానికి అన్యాయం జరగకూడదని జగన్ ఒప్పుకోలేదు. కేంద్రంలో చంద్రబాబు ప్రభావమేమీ లేదు. కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకోండి. దమ్ముంటే కేంద్రాన్ని ప్రశ్నించేందుకు మాతో కలిసి రండి. పోలవరం హక్కులను సాధించుకోలేకపోతే మీరంతా ఆంధ్రా ద్రోహులుగా మిగిలిపోతారు. అమరావతి విషయంలో కూటమి నేతలు ఎందుకు స్వీట్లు పంచుకుంటున్నారో అర్ధం కావడం లేదు. అమరావతికి 15వేల కోట్లు ముష్టివేశారు. ప్రపంచబ్యాంకు షరతులకు తలొగ్గి అమరావతికి అప్పు తెచ్చారు.

ఉత్తర భారత అహంకారం నశించాలన్న మాటలు పవన్ కళ్యాణ్ మర్చిపోయారా?. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ పవన్ గొంతు చించుకున్నారు. యువతకు అన్యాయం జరుగుతుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నవాళ్లు ఆంధ్రా ద్రోహులే. ఉత్తర భారత బీజేపీ పార్టీ మనకు తీరని ద్రోహం చేస్తోంది. తెలుగు జాతి ఇప్పటికైనా మేలుకోవాలి’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)