Breaking News

ఢిల్లీలో కాంగ్రెస్‌కు దిక్కులేదు: కిషన్‌రెడ్డి

Published on Fri, 01/17/2025 - 19:10

సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishanreddy) అన్నారు. శుక్రవారం(జనవరి17) కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అంశంపై మీడియాతో మాట్లాడారు.

‘కాంగ్రెస్‌(CongressParty)కు ఢిల్లీలో దిక్కు లేదు..ఢిల్లీ(Delhi) ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా మద్దతివ్వడం లేదు. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటే ఇలాంటి చర్చే ఉండదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌తో దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈజీ గా ఉంటుంది’అని చెప్పారు. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరనున్నాయి.

అదే నెల 8వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. కొందరు నేతల మాటలు హద్దులు మీరుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) భావిస్తుండగా ఆప్‌ను ఈసారైన ఓడించి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టిగా పనిచేస్తోంది.

ఢిల్లీలో పేరుకు ముక్కోణపు పోటీ ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం​ ఆప్‌, బీజేపీ మధ్యనే ఉండనుందని తెలుస్తోంది. కేసుల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్‌ మళ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే సీఎం పదవి చేపడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి: బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టో కీలక హామీలు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)