Breaking News

ఇక్కడి వాళ్లతో దావోస్‌లో ఒప్పందాలేంటి?: కిషన్‌రెడ్డి

Published on Fri, 01/24/2025 - 15:10

సాక్షి,హైదరాబాద్‌:సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై కిషన్‌రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రానికి లాభం చేకూరుతంది అంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదు.  

తెలంగాణ కంపెనీలనే దావోస్‌ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసుకోడం ఎంటి..?. నాకు ఏం అర్ధం కాలేదు. విదేశాలు,ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడి రావాలి. కాగితాలకే ఒప్పందాలు పరిమితం కావొద్దు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నారు.పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది. 

ముందు ఇళ్లు చక్కబెట్టుకోవాలి. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి బయటికి వద్దామనుకుంటున్నారు.వ్యాపారం చేసుకోవడానికి వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నారు. గత ప్రభుత్వం కొందరు వ్యాపారవేత్తలపై పక్షపాతం చూపిస్తే ఈ ప్రభుత్వం వ్యాపారులందరినీ వేధిస్తోంది.

అందుకే అనేకమంది పారిశ్రామిక వేత్తలు మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌కి వెళ్లిపోతున్నారు. వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం సరికాదు. కాంగ్రెస్ వేధించని పారిశ్రామికవేత్త లేడు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

కాగా, సీఎం రేవంత్‌ దావోస్‌ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడ వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) సమావేశాల్లో పాల్గొని పలు కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో తెలంగాణకు చెందిన మేఘా  కంపెనీ పెట్టుబడులు కూడా ఉండడం విమర్శలకు దారితీసింది.

సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)