Breaking News

రేవంత్‌ స్వగ్రామంలో సంబరాలు

Published on Wed, 12/06/2023 - 01:14

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/వంగూరు: కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించగానే ఆయన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం సాయంత్రం గ్రామ ప్రజలు రోడ్లమీదకు వచ్చి టపాకాయలు కాల్చి డీజే పాటలకు డ్యాన్సులు చేశారు. మా మధ్యలో పెరిగిన మా రేవంత్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. 

విద్యార్థి దశ నుంచే తెలివైనవాడు 
రేవంత్‌రెడ్డి తాండ్ర ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదివినప్పుడు నేను టీచర్‌గా పనిచేశాను. అప్పుడే తరగతిగదిలో రేవంత్‌ మ క్కువను నేను గమనించేవాడిని. భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదుగుతాడ ని అనుకున్నాను. నేను చదువు చెప్పిన విద్యార్థి ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం గర్వంగా ఉంది. – జగన్‌మోహన్‌రెడ్డి, రిటైర్డ్‌ హెచ్‌ఎం, తాండ్ర 

చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి  
రేవంత్‌రెడ్డి నాకు క్లాస్‌మేట్, బంధువు కూడా. చిన్నప్పటి నుంచి కూడా రాజకీయా లపై ఆసక్తి ఎక్కువ. చదువులోనే కాకుండా ఆటల్లోనూఉత్సాహం కనబరిచేవాడు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు కొండారెడ్డిపల్లిలో, 6వ తరగతి తాండ్ర గ్రామంలో చదువుకున్నాం. నా స్నేహితుడు రాష్ట్రానికి సీఎం కావడం ఎంతో గర్వంగా ఉంది.   – కేవీఎన్‌ రెడ్డి, వంగూరు జెడ్పీటీసీ, రేవంత్‌రెడ్డి స్నేహితుడు 

నా సంతోషానికి అవధుల్లేవు  
రాజకీయ నేపథ్యం లేకున్నా కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు. నా స్నేహితుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నాతో పాటు మా గ్రామస్తులంతా గర్వపడుతున్నాం. ఐదో తరగతి వరకు కొండారెడ్డిపల్లిలో ఒకే పాఠశాలలో చదువుకున్నాం.  – ధర్మారెడ్డి, రేవంత్‌రెడ్డి స్నేహితుడు

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)