Breaking News

Fodder Scam Case: దాణా స్కాంలో లాలూకు షాక్‌

Published on Fri, 08/18/2023 - 19:14

పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు దానా కుంభకోణం కేసులో ఎదురుదెబ్బ తగిలింది. లాలూకు జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌ను సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వలోని ధర్మాసనం ఆగష్టు 25న విచారణ చేపట్టనుంది. 

లాలూ ప్రసాద్ యాదవ్ విభజన చెందని బిహార్‌కు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ట్రెజరీ నుంచి దాదాపు 950 కోట్ల రూపాయలను అక్రమంగా బయటకు తీశారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ వ్యవహారంలో మొత్తం ఐదు కేసులు ఉండగా.. దుమ్కా, చైబాసా, డోరాండా, డియోగర్ ట్రెజరీలకు సంబంధించిన కేసుల్లో రాంచీలోని సీబీఐ కోర్టు దోషిగా తేల్చి మొత్తం 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఐదో కేసులో ఐదేళ్ల శిక్షను ఖరారు చేసి, రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది.   

తాజాగా ఆయన ఆరోగ్యం బాగులేని కారణంగా జార్ఖండ్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు సింగపూర్‌లో చికిత్స పూర్తయింది. తన కూతురు ఓ కిడ్నీని దానం చేయగా.. లాలూ విజయవంతంగా అనారోగ్యం నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం ఇండియా కూటమి తరపున కూడ సమావేశాల్లో పాల్గొన్నారు. తాజా పరిణామంతో మరోసారి ఆయన కోర్టు మెట్లెక్కనున్న పరిస్థితి ఎదురైంది. 

ఇదీ చదవండి: అఫీషియల్‌ ప్రకటన: పరాభవం పాలైన చోటు నుంచే రాహుల్ గాంధీ పోటీ

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)