Breaking News

గంటా కుమారుడిపై కేసు నమోదు

Published on Sat, 04/13/2024 - 08:43

మధురవాడ : భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ, టీడీపీ నాయకులు నమ్మి శ్రీను, జీవీఎంసీ 5వ వార్డు కార్పొరేటర్‌ తండ్రి, రాష్ట్ర బీసీ సెల్‌ నాయకుడు మొల్లి లక్ష్మణరావు తదితరులపై పీఎంపాలెం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

 రంజాన్‌ సందర్భంగా గురువారం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపే నెపంతో శివశక్తినగర్‌ రోడ్డులోని సద్గురు సాయినాథకాలనీలోలో ఉన్న మసీద్‌–ఇ– ఫిర్ధౌస్‌లో పార్టీ కండువాలు ధరించి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ల ఫొటోలతో ఉన్న స్టిక్కర్లు అతికించి స్వీట్స్‌బాక్స్‌లు పంపిణీ చేశారు. వీటిని స్వయంగా గంటా కుమారుడు రవితేజ  ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు, నమ్మి శ్రీను తదితరులు పంపిణీ చేశారు. దీనిపై‘సాక్షి’ దినపత్రికలో ‘టిడీపీ బరితెగింపు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. భీమిలి హారి్టకల్చర్‌ ఆఫీసర్, నియోజకవర్గ ఎంసీసీ టీమ్‌–4 ఇన్‌చార్జ్‌ ఆర్‌పీ స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
 
గంటా బావమరిదిపై చర్యలు తీసుకోవాలి 
ఈ పంపిణీ వ్యవహారంలో గంటా బావమరిది జీవన్‌ కుమార్‌తో పాటు మరికొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, వీరు పేర్లు ఫొటోలు కూడా పత్రికలో ప్రచురితమయ్యాయి. అయితే వారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని విమర్శలు వస్తున్నాయి. మరింత లోతుగా విచారణ చేసి కోడ్‌ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)