Breaking News

ఎవరైనా నా పర్మిషన్‌ తీసుకోవాల్సిందే!: శరద్‌ పవార్‌

Published on Tue, 07/04/2023 - 20:52

ముంబై:  తన ఫోటోను తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఉపయోగించడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ.. తన భావజాలానికి ద్రోహం చేసినవారు, తన అభిప్రాయాలతో విభేదించేవారు, సైద్ధాంతిక విభేదాలున్నవారు తన ఫోటోను ఉపయోగించవద్దని స్పష్టం చేశారు.

తాను జాతీయ అధ్యక్షుడిగా, జయంత్ పాటిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీ అనే వర్గం మాత్రమే తన ఫోటోను ఉపయోగించుకోవాలన్నారు. తన ఫోటోను ఎవరు ఉపయోగించుకోవాలో నిర్ణయించే హక్కు తనదేనని, తన అనుమతి తప్పనిసరి అన్నారు. 

అజిత్ పవార్, పార్టీకి చెందిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరిన రెండురోజుల తర్వాత పవార్ ఈ ప్రకటన చేశారు. అజిత్ పవార్ మంగళవారం తమ వర్గానికి కొత్తగా ఎన్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ పార్టీ కార్యాలయంలో శరద్ పవార్ ఫోటో కనిపించింది.

అయితే ఆ పార్టీ కార్యాలయం తాళం చేతులు లేకపోవడంతో పెద్ద హైడ్రామానే నడిచింది అక్కడ. ఇక.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ చీలిక వర్గం.. లోక్‌సభ ఎంపీ సునీల్ తట్కరేని ఎన్సీపీ రాష్ట్ర శాఖ చీఫ్‌గా ఉంటారని ప్రకటించడం గమనార్హం.

ఇదీ చదవండి: కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు నోటీసులు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)