Breaking News

రేవంత్‌కు హరీష్‌ అంటే భయం: మాజీ మంత్రి వేముల

Published on Tue, 09/10/2024 - 19:02

సాక్షి, తెలంగాణ భవన్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హరీష్‌రావు అంటే భయం. అందుకే ఆయనకు పీఏసీ చైర్మన్‌ ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి. సీఎం రేవంత్‌ ఓ నియంతగా మారాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అలాగే, అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవడం ప్రపంచమంతా చూసిందని చెప్పుకొచ్చారు.

కాగా, ప్రశాంత్‌ రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘సహజంగా ప్రశ్నించే ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం దేశంలో ఆనవాయితీగా వస్తోంది. పీఏసీ చైర్మన్‌ పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఇవ్వడం పార్లమెంటరీ స్ఫూర్తికి, సంప్రదాయాలకు విరుద్ధం. పీఏసీలో మొత్తం 13 సభ్యులు ఉండాలని.. ఇందులో తొమ్మిది మంది అసెంబ్లీ నుంచి ఉండాలని అసెంబ్లీ రూల్ బుక్‌లో స్పష్టంగా ఉంది. ఎన్నిక పూర్తయిన తర్వాత స్పీకర్ అసెంబ్లీలోనే కమిటీ సభ్యుల పేర్లు ప్రకటించాలి. అసెంబ్లీ రూల్ బుక్‌లో 250 రూల్ కింద పీఏసీకి సంబంధించి ప్రతిపక్షానికి సంఖ్యను బట్టి సభ్యుల సంఖ్యను కేటాయిస్తారు.

బీఆర్ఎస్‌కు నిబంధనల ప్రకారం పీఏసీలో ముగ్గురు సభ్యులకు అవకాశం ఉంటుందని చెబితే నామినేషన్లు వేశాము. నేను, హరీష్ రావు, గంగుల కమలాకర్ నామినేషన్లు వేశాము. మధ్యలో అరికెపూడి గాంధీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది. పీఏసీ సభ్యుల కన్నా ఎక్కువ నామినేషన్లు వస్తే ఓటింగ్ జరగాలి. ఓటింగ్ జరగకుండానే హరీష్ రావు నామినేషన్‌ను ఎలా తొలగించారు. బీఆర్‌ఎస్‌ తరఫున గాంధీ నామినేషన్‌ వేయడానికి ఎవరు అనుమతించారు. అరికెపూడి గాంధీ బీఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తి అని మంత్రి శ్రీధర్‌ బాబు చెబుతున్నారు. గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించమని కేసీఆర్‌ సూచించారా?. కేసీఆర్‌ను శ్రీధర్‌ బాబు ఎప్పుడు సంప్రదించారో చెప్పాలి.

పీఏసీ కమిటీల విషయంలో రేవంత్‌ సర్కార్‌ అతి పెద్ద తప్పు చేసింది. రాహుల్‌ గాంధీ మాటలు కూడా వినిపించుకోలేని స్థాయికి రేవంత్‌ వెళ్లారా?. కాంగ్రెస్‌లో సీనియర్‌ అయిన జానారెడ్డి వంటి వారు కూడా రేవంత్‌కు చెప్పే స్థితిలో లేరా?. పీఏసీపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ పునరాలోచన చేయాలని కోరుతున్నాం. పీఏసీ నియామకంపై తెలంగాణ రాజకీయ విశ్లేషకులు స్పందించాలి. పీఏసీపై స్పీకర్‌ నిర్ణయం మారకపోతే గవర్నర్‌ను కలవడం, ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తాం.

మోదీ హాయంలో మొదటి రెండు పర్యాయాలు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకున్నా పీఏసీ చైర్మన్ పదవులు దక్కాయి. మొన్నటికి మొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచన మేరకు కేసీ వేణుగోపాల్‌కు కేంద్రంలో పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఓ సూత్రం.. తెలంగాణలో మరో సూత్రమా?. రాహుల్ రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతారు.. ఆ రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా?. రాహుల్ విధానాలు తెలంగాణలో అమలు కావా?’ అంటూ ప్రశ్నించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)