Breaking News

కేసీఆర్‌ ఆదేశాలతో తుమ్మలకు బుజ్జగింపులు

Published on Wed, 08/23/2023 - 14:35

సాక్షి, హైదరాబాద్‌: అసంతృప్తులను చల్లార్చేందుకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం రంగంలోకి దిగింది. ఖమ్మం సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం భేటీ అయ్యారు. గంటకు పైనే ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. 

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుమ్మల టికెట్‌ ఆశించారు. అయితే ఆ టికెట్‌ను కందాల ఉపేందర్‌రెడ్డికి కేటాయించింది అధిష్టానం. దీంతో తుమ్మల అనుచరులు అసమ్మతి గళం లేవనెత్తారు. నిన్నంతా సమావేశమై పార్టీ నుంచి బయటకు రావాలంటూ తుమ్మలకు సూచించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తుమ్మల సైతం టికెట్‌ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ వైపు ఆయన చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. 

దీంతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తుమ్మలతో చర్చించాలని నామా నాగేశ్వరరావును ఆదేశించారు. ఈ క్రమంలోనే ఇవాళ వాళ్ల భేటీ జరిగింది. మరోవైపు తుమ్మల తరహా నేతలు మరికొందరితోనూ చర్చించాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం.

తుమ్మల నాగేశ్వరరావు  రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది.  1983 ఎన్నికల్లో ఓడారాయన.  ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు.  2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారాయన. ఎమ్మెల్సీగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కూడా.  అప్పటి నుంచి పాలేరు కేంద్రంగా రాజకీయం నడిపిస్తున్నారాయన.  2016లో పాలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరగ్గా..  తుమ్మల నాగేశ్వరరావు  విజయం సాధించారు. అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా కూడా ఆయన పాలేరు నుంచి టికెట్‌ ఆశించారు. 

  

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)