Breaking News

తుగ్లక్ పాలన చేస్తూ పేర్లు మారుస్తారా?: తలసాని ఫైర్‌

Published on Sun, 01/18/2026 - 11:13

సాక్షి, సికింద్రాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. తుగ్లక్ పాలన చేస్తూ పేర్లు మార్పు చేస్తున్నారు అని ఆరోపించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మొదట ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసులు రాత్రి 10.40కి అనుమతి రద్దు చేశారు. సికింద్రాబాద్ పేరు మార్చడం లేదని సీఎం చెబుతూనే మల్కాజిగిరి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. తుగ్లక్ పాలన చేస్తూ పేర్లు మార్పు చేస్తున్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం తప్పదు. నిన్న ఎన్ని విధాలు ప్రయత్నించినా వాళ్ళు ఫెయిల్ అయ్యారు మనం సక్సెస్ అయ్యాం. మొదటి వారంలో కోర్టు అనుమతితో వేలాది మందితో ర్యాలీ చేస్తాం. కలిసి వచ్చే పార్టీలు కలిసి రావాలని కోరాం. ర్యాలీకి మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ఈసారి జరిగే ర్యాలీని ఎవరూ అడ్డుకోలేని విధంగా నిర్వహిస్తాం. మన రక్తంలోనే భయమన్న మాట లేదు.. కేసులకు భయపడేది లేదు అంటూ హెచ్చరించారు.

కాగా, సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్‌ఎస్‌.. శనివారం పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు భారీ శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే.. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్‌ జిల్లా సాధన సమితి పేరుతో ర్యాలీకి అనుమతి అడిగారని.. అయితే నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కారణంతో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)