Breaking News

ఇథనాల్ మంటలు: కాంగ్రెస్ నేతలకు తలసాని సవాల్

Published on Thu, 11/28/2024 - 13:46

సాక్షి, హైదరాబాద్: దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే, దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని మీడియాతో మాట్లాడుతూ..‘ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో నా కుమారుడికి సంబందం ఉందని పీసీసీ అధ్యక్షుడు, మంత్రి సీతక్క ఆరోపణలు చేశారు. ఇథనాల్ కంపెనీతో మా కుటుంబానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ వద్దు అని అక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో ఒకరిగా నా కుమారుడు ఉన్నారు. 2016లోనే డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్ గా నా కుమారుడు రాజీనామా చేశాడు.

ఆ పేపర్లను పట్టుకుని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నా కుటుంబానికి చెందిన కంపెనీ అని నిరూపిస్తే మీకే కంపెనీని రాసిస్తాను. బీఆర్ఎస్ పార్టీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. దిలావర్‌పూర్‌ గ్రామ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం. ఇథనాల్ కంపెనీకి గత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. లగచర్లలో కేటీఆర్ కుట్ర చేశారని ప్రభుత్వం ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు