ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు

Published on Fri, 06/07/2024 - 04:37

నల్లగొండ: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి ఆరోపించారు. 3వ రౌండ్‌లో తనకు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్‌ అభ్యరి్థకి మెజారిటీ ఉందంటూ ప్రకటించారని, కౌంటింగ్‌పై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. నల్లగొండలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రాకేష్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్‌ ఏకపక్షంగా చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకాలు లేకుండానే 3వ రౌండ్‌ లీడ్‌ను ప్రకటించారని చెప్పారు. రిటర్నింగ్‌ అధికారి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. 3వ రౌండ్‌ ఫలితాలు అడిగితే బయటకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతోందని, మళ్లీ లెక్కించాలని డిమాండ్‌ చేశారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రౌండ్‌ ఫలితాలు ప్రకటించే విషయంలో కౌంటింగ్‌ ఏజెంట్లకు చూపించకుండా ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని అన్నారు. అడిగితే అనుమానం నివృత్తి చేయడం లేదని, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తారుమారు జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)