Breaking News

ఉప రాష్ట్రపతి ఎన్నిక.. బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం?

Published on Mon, 09/08/2025 - 11:14

సాక్షి, హైదరాబాద్‌: ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎన్డీయే, ఇండి‌యా కూటమి.. రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్దంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ లేకపోవడంతో తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, బీఆర్‌ఎస్‌కు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావ్, పార్థ సారథి రెడ్డి ఎంపీలుగా కొనసాగుతున్నారు. 

మరోవైపు, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ..‘ఉపరాష్ట్రపతి ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తుంది. మా అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా కార్యకర్తలపై దాడులకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది . అందులో భాగంగానే ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వం. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టే చర్యలకు పాల్పడుతోంది. యూరియా సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ఓట్లు అక్కర్లేదని మాట్లాడిన తీరుకు వాళ్ళ అభ్యర్థికి మద్దతు ఇవ్వం. రెండు కూటముల అభ్యర్థులు సమర్థులైనప్పటికీ.. కూటములు చేసే చర్యల వల్ల ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)