Breaking News

హస్తం గూటికి పట్నం దంపతులు! 

Published on Fri, 02/09/2024 - 02:00

వికారాబాద్‌: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి దంపతులు కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువా, బొకేలతో సన్మానించారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో త్వర లో నిర్వహించనున్న బహిరంగ సభలో వీరు హస్తం కండువా వేసుకోనున్నట్లు సమాచారం. మహేందర్‌రెడ్డి మద్దతుదారులు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. తాండూరు నియోజకవర్గంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న, సీనియర్‌ నాయకులు రవి గౌడ్, కరణం పురుషోత్తంరావ్‌ తదితరులు పట్నం వెంట వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

ఎన్నికలకు ముందే వెళ్లాలని భావించినా..  
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. అప్పట్లో కేసీఆర్‌ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించటంతో పాటు చివరి నిమిషంలో మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో కొద్ది నెలలుగా బీఆర్‌ఎస్‌కు అంటీముట్టనట్లు ఉంటున్నారు. 

చేవెళ్ల ఎంపీ సీటు కమిట్‌మెంటుతోనే..? 
మరో నాలుగు నెలల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఆమె చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. కాగా, మహేందర్‌రెడ్డి సోదరుడు, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాత్రం తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ‘సాక్షి’కి తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)