Breaking News

‘రేవంత్‌ రెడ్డి ఫ్లయిట్‌ మోడ్‌ సీఎం’

Published on Mon, 03/24/2025 - 19:24

బాన్సువాడ(కామారెడ్డి జిల్లా):   సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఫ్లైట్ మోడ్ లోనే ఉంటాడంటూ విమర్శించారు కవిత. ఈరోజు(సోమవారం) కామారెడ్డి జిల్లా పర్యటలో భాగంగా బాన్సువాడలో ఆమె మాట్లాడారు. ‘బాన్సువాడ బీఆర్ఎస్ గడ్డ. నాయకులు వస్తారు.. పోతారు.. పార్టీ మాత్రం ఉంటుంది. నేను, బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి లాంటి వారం బాన్సువాడకు అండగా ఉంటాం. సీఎం రేవంత్ ది ఎప్పుడూ ఫ్లైట్ మోడే. అందుకే 15 రోజులకొకసారి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ చెప్పినట్లు వింటారు. 15 నెలలుగా జనాలు అష్టకష్టాలు పడుతుంటే రేవంత్ మాత్రం ఢిల్లీ చక్కర్లు కొడతారు. క్రిస్టియన్ సోదరులకు, ముస్లిం సోదరులకు పండుగ బహుమతులు ఎత్తేశారు’ అంటూ విమర్శించారు.

వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు బీఆర్‌ఎస్‌ వ్యతిరేకం
‘తులం బంగారం అన్నారు.. అదీ లేదు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ లేదు. వీటిన్నంటిపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం.. రేవంత్ దృష్టికి తీసుకెళ్లి ఇప్పించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లును బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా మీ తరుఫున కొట్లాడడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ముందుంటుంది. మీ పక్షాన నిలబడుతుంది.. మేము ఎప్పటికీ మీ వెంటనే ఉంటాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.. రియల్‌ ఎస్టేట్‌ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది.

తెలంగాణలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదు.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నెలకు ఒకటి చొప్పున మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. కానీ ముఖ్యమంత్రి ఏ ఒక్కరోజు ఈ ఘటనలపై రివ్యూ చేయలేదు. రేవంత్‌ రెడ్డి ఫ్లయిట్‌ మోడ్‌ సీఎం. ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలన్నా., ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీకి వెళ్లి పర్మిషన్‌ తీసుకోవాలే. రేవంత్‌ రెడ్డి ఫ్లయిట్‌ మోడ్‌ సీఎం. ఆయన ఇప్పటి వరకు 40 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు.

జైనూర్‌ లో మూడు నెలలు ఇంటర్నెట్‌ బంద్‌ పెట్టారు. అక్కడ హిందూ ముస్లింల ఇండ్లను దహనం చేసినా ముఖ్యమంత్రికి వాటిపై సమీక్షించేంత తీరిక లేదు. ముస్లింలకు కేసీఆర్  రంజాన్‌ తోఫా ఇచ్చారు.. కానీ ఈ ప్రభుత్వం వాటిని బంద్‌ చేసింది.. మైనార్టీల కోసం పెట్టిన బడ్జెట్‌ లో 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదు. ముస్లిం యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చింది.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు’ అని ధ్వజమెత్తారు కవిత.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)