Breaking News

రేవంత్‌.. ముందు నీ భాష మార్చుకో: కౌశిక్‌ రెడ్డి

Published on Fri, 01/17/2025 - 12:04

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది తాను కాదు.. సీఎం రేవంత్‌ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.

పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్‌ ట్యాంక్‌ సీఐ ఎదుట కౌశిక్‌ రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్‌ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకుపైగా ఆయనను పోలీసులు విచారించారు.

ఇక, విచారణ అనంతరం పీఎస్‌ బయట కౌశిక్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు నన్ను గంట పాటు విచారించారు. విచారణలో భాగంగా 32 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నే అడిగారు మళ్లీ అడిగారు. నేను అన్నింటికీ సమాధానం ఇచ్చాను నా స్టేట్‌మెంట​్‌ రికార్డ్‌ చేశారు. నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలపై ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను.  

డిసెంబర్ నాలుగో తేదీన ఫిర్యాదు చేయడానికి నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయిట్మెంట్ తీసుకొని అక్కడిని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపైనే కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. పండుగ రోజు కూడా నన్ను దొంగ లాగ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది నేను కాదు.. రేవంత్‌ మార్చుకోవాలి అని హితవు పలికారు. 

కేసులకు భయపడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)