Breaking News

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య

Published on Fri, 06/28/2024 - 15:24

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌లో​కి ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్‌ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లోకి చేరారు. కాలె యాదయ్యకు సీఎం రేవంత్‌.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, ఇటీవల మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి చేరారు. తాజాగా, బీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌ బాట పట్టారు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా నాలుగు రోజుల వ్యవధిలోనే బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023లలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు.

	కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

 



 

 

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)