Breaking News

పీఏసీ ఛైర్మన్‌గా అరికెపూడి.. హరీష్‌రావు సీరియస్‌

Published on Mon, 09/09/2024 - 18:27

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. బీఆర్‌ఎస్‌ బీఫామ్‌తో గెలిచి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీకి ఏపీసీ ఛైర్మన్‌ పదవి ఇవ్వడమేంటని ఆయన ​ప్రశ్నించారు.

కాగా, మాజీ మంత్రి హరీష్‌ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పీఏసీ ఛైర్మన్‌ పదవి ప్రతిపక్షంలో ఉ‍న్న వారికి ఇవ్వాలి. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న వారికి కాదు. అరికెపూడి గాంధీకి ఎలా ఇస్తారు. లోక్‌సభలో పీఏసీ ఛైర్మన్‌ కేసీ వేణుగోపాల్‌కు ఇవ్వలేదా?. రాహుల్‌ గాంధీ లోక్‌సభలో భారత రాజ్యాంగాన్ని పట్టుకుని మాట్లాడుతారు. కానీ, తెలంగాణలో మాత్రం రాజ్యంగం ఉండదా?. రాహుల్‌కు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

ఇదే సమయంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్‌ మాట్లాడుతూ..‘ఈరోజు 16వ ఆర్థిక సంఘాన్ని కలిశాము. ప్రస్తుతం ఉన్న 40 శాతం షేర్‌ను 50% పెంచాలని కోరాము. కానీ, ప్రస్తుతం ఉన్న 40% కూడా కాకుండా 31 శాతమే తెలంగాణకి షేర్ వస్తుంది. తెలంగాణకి రావలసిన నిధుల షేర్‌పై మా వాదన గట్టిగా వినిపించాం. తెలంగాణ ఆదాయం మంచిగా ఉంది మీకు తక్కువ నిధులు కేటాయిస్తామంటే కరెక్ట్ కాదు. దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంలో తెలంగాణ మారటానికి కేసీఆర్ చేసిన కృషిని ఆర్థిక సంఘానికి వివరించాము. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరాము. ఇంటింటికి నీరు అందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నిధులు ఇవ్వలేదు. హర్ ఘర్ జల్‌లో  భాగంగా మిషన్ భగీరథకి రూ.2500 కోట్లు మెయింటెనెన్స్ ఇవ్వమని అడిగిన ఇవ్వలేదు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)