Breaking News

కాంగ్రెస్‌ మోసానికి పరాకాష్ట

Published on Sun, 01/05/2025 - 04:34

సాక్షి, హైదరాబాద్‌: రైతు భరోసా పేరుతో ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. రైతులను దారుణంగా మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం రైతుల ఆశలను అడియాశలు చేసింది. 

రైతు భరోసా పథకాన్ని రైతు గుండె కోతగా మార్చారు. రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్‌లో రూ.7,500 చొప్పున ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.6 వేలకు కుదించారు. కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట. మోసానికి పర్యాయపదం రేవంత్‌రెడ్డి అనే విషయం నగ్నంగా బయటపడింది’అని హరీశ్‌రావు మండిపడ్డారు. 

కేబినెట్‌లో కౌలు రైతుల ఊసేలేదు 
కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా గుండెకోత మిగిల్చిందని హరీశ్‌రావు ఆరోపించారు. ‘కౌలు రైతులకు కూడా రెండు వ్యవసాయ సీజన్లలో కలిపి ఎకరా కు రూ. 15 వేలు పంట పెట్టుబడి సహాయం అందిస్తా మని కాంగ్రెస్‌ ప్రమాణం చేసింది. 

కానీ తాజా కేబినెట్‌ సమావేశంలో ఈ అంశమే చర్చించలేదు. కౌలు రైతులకు గుండె కోత కలిగిస్తూ దారుణంగా ధోకా చేశారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు’అని హెచ్చరించారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)