Breaking News

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, గాలి అనిల్‌

Published on Mon, 07/15/2024 - 18:16

సాక్షి, పటాన్‌చెరు: తెలంగాణలో కాంగ్రెస్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక, తాజాగా ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి కూడా వలసలు మొదలయ్యాయి.

తాజాగా బీఆర్‌ఎస్‌ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, గత పార్లమెంట్‌ ఎన్నికల్లో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్‌ కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ సమక్షంలో వీరు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్‌.

ఈ సందర్భంగా మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజా ప్రతినిధులు, ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాను. ఇన్ని రోజులు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పటాన్‌చెరు ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి నన్ను గెలిపించారు. కచ్చితంగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి పార్టీ కండువా కప్పుకున్నాను. గత పది ఏళ్లు నాకు సహకరించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు, ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలాఉండగా.. తెలంగాణలో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరారు. గూడెం మహిపాల్‌ రెడ్డితో ఈ సంఖ్య పదికి చేరుకుంది. ఇక, రానున్న రోజుల్లో మరికొ​ంత మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)