Breaking News

పట్నం కోసం రంగంలోకి బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌.. పిటిషన్‌ దాఖలు

Published on Fri, 11/15/2024 - 10:12

సాక్షి, హైదరాబాద్‌: లగచర్ల ఘటన కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు.. నరేందర్‌ రెడ్డిని స్పెషల్‌ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌ కోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని ఆయన కోరారు. నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి. అయితే, ఈరోజు హైకోర్టుకు సెలవు కావటంతో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌ నేడు హౌజ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. నరేందర్‌ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉ‍న్నారు. జైలులో ఐదుగురు నేరస్థులతో కలిపి మాజీ ఎమ్మెల్యేను ఉంచారని బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయనను స్పెషల్‌ బ్యారక్‌లో ఉంచాలని కోర్టును కోరనుంది. 

ఇదిలా ఉండగా.. లగచర్ల ఘటనలో మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్యంగా ఓ ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. మరో కొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. 


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)