Breaking News

ఆగస్టు 2 డెడ్‌లైన్‌.. రైతులతో కలిసి పంపులు ఆన్‌ చేస్తాం: కేటీఆర్‌

Published on Fri, 07/26/2024 - 12:03

సాక్షి, కాళేశ్వరం: కేటీఆర్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా మొదటగా వీరు కన్నెపల్లి పంప్‌హౌజ్‌ వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ వద్ద కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ..‘బాబ్లీ ప్రాజెక్ట్‌ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్‌ హయాంలో ప్రతీ రిజర్వాయర్‌ నిండుకుండలా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దయచేసి ప్రాజెక్ట్‌లపై రాజకీయం చేయకండి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రిజర్వాయర్లను నింపడం లేదు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఓ గుండె లాంటింది. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్‌ను కట్టాం. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రైతులకు కల్పతరువు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకుండా ముందు చూపుతో కేసీఆర్‌ కాళేశ్వరం నిర్మించారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరితగతిన ప్రాజెక్ట్‌ను నిర్మించలేదు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎప్పుడూ నీటి సమస్య లేదు.

గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. కాళేశ్వరాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్ట్‌పై విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు రెండో తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం. ప్రభుత్వం స్పందిచకపోతే 50వేల మంది రైతులతో​ మేము పంపులు ఆన్‌ చేస్తాం. బీడు భూములకు నీళ్లు అందిస్తాం. రాజకీయపరమైన నిర్ణయం వల్లనే నీటిని ఎత్తిపోయడం లేదు. ఈ ప్రభుత్వం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీరాంసాగర్‌ సామర్థ్యం 90 టీఎంసీలు, ఇప్పుడు కేవలం 25 టీఎంసీలే ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్‌ల్లో ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్రమంతా కాళేశ్వరం నీటి కోసం చూస్తున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు.

ఒక్క బటన్ నొక్కితే పైన ఉన్న ఎల్‌ఎండీ, మిడ్‌ మానేరు సహ ఎస్‌ఆర్‌ఎస్పీ కూడా నింపొచ్చు. ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్ పేరుతో ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. పోలవరం కొట్టుకుపోతే ఏళ్లు గడిచినా ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ, కాళేశ్వరం విషయంలో రోజుల్లోనే రిపోర్టులు ఇచ్చింది. కేవలం కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే ఇదంతా జరుగుతోంది. ఎలాగూ మీరంతా అనుకున్నట్టుగానే కేసీఆర్‌ను ఓడించారు. ఇంకా రైతులపై ఎందుకింత పగ. రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఇబ్బందిపెట్టకండి అంటూ కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు గోదావరి జలాలకు ప్రత్యేక​ పూజలు చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)