Breaking News

నేను గరళ కంఠుడిని.. బాధను దిగమింగుకుంటున్నా!: కేసీఆర్‌

Published on Wed, 07/24/2024 - 05:06

సాక్షి, హైదరాబాద్‌: ‘రాజకీయంగా ఎదుర్కొనలేక నా కూతురు కవితను కేసులో ఇరికించారు. తండ్రిగా నాకు ఎంతో బాధ ఉన్నా సంయమనంతో మౌనం పాటిస్తున్నా. గరళ కంఠుడిలా బాధను దిగమింగుకుంటున్నా. అగ్ని పర్వతంలా ఉన్నా. నాకు ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో తెలుసు. పార్టీలో ఉండే వారు ఉంటారు.. వెళ్లే వారు వెళ్తారు. పార్టీలో ఉండాలా.. వద్దా అనేది వాళ్ల ధర్మం. కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రజలు తలచుకుంటే ఏమైనా జరగొచ్చు. పార్టీకి ఇది క్లిష్ట సమయం అనే వాదన సరికాదు. లక్షలాది కార్యకర్తలు ఉన్న పార్టీ మనది. ధైర్యం చెడకుండా ఇష్టంతో జనంతో మమేకమవుదాం’అని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం  కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్‌లో మంగళవారం సుమారు మూడు గంటలపాటు కేసీఆర్‌ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులు, రాబోయే రోజుల్లో అసెంబ్లీ లోపలా బయటా పార్టీ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణ తదితరాలపై కేసీఆర్‌ ప్రసంగించారు. ‘అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తయారు చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌కు ఉంది. ఉద్యమ కాలంలో ఢిల్లీతోపాటు స్థానికంగా బలమైన శక్తులతో పోరాడాం. రాష్ట్ర సాధన, అభివృద్ధిలో మనది విజయగాథ. అందరం ఇష్టంతో పనిచేద్దాం. ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్‌ తీరును ప్రజలు గమనిస్తున్నారు’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 
 
హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది 
‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వివిధ రంగాలకు సంబంధించిన విధానాలు రూపొందించేందుకు కొంత వ్యవధి ఇచ్చాం. అయితే 8 నెలలు కావస్తున్నా విద్య, వైద్యం, విద్యుత్‌ సహా ఏ రంగంపైనా ఒక స్పష్టత లేకుండా పోయింది. కొత్త విధానాలు రూపొందించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్‌ పీరియడ్‌ ముగిసినందున ఇకపై ప్రజాక్షేత్రంలో మనం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. 

ఏకకాలంలో రుణమాఫీ అనేది పెద్ద మోసం.. ఈ అంశాన్ని అసెంబ్లీలో ఎండగట్టాలి. అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు హామీలు ఇవ్వడం సహజం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడం ప్రజలను మోసగించడమే’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. వివిధ రంగాల్లో రాష్ట్ర అవతరణ మొదలుకుని బీఆర్‌ఎస్‌ దూరదృష్టితో అమలు చేసిన పథకాలు, పనులను సోదాహరణంగా వివరించారు. వ్యవసాయ రంగం స్థిరీకరణకు చేసిన ప్రయత్నాలను సుదీర్ఘంగా వివరించారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)