Breaking News

తొందరలోనే రేవంత్‌ అధికార కోట కూలుతుంది: జగదీష్‌రెడ్డి

Published on Sun, 01/18/2026 - 19:59

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో చంద్రబాబుకు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. దమ్ముంటే బీఆర్‌ఎస్‌ దిమ్మెలు కూలగొట్టండి. మేమేంటో చూపిస్తామంటూ జగదీష్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రోత రాతల పత్రికపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్‌ల సంఘం కోరాలి. త్వరలోనే పోలీసుల కూడా ప్రభుత్వంపై తిరగబడే  రోజు వస్తుందంటూ జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

‘‘తొందరలోనే రేవంత్‌ అధికార కోట కూలుతుంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు, పంచుకునేందుకు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. నేడు ఖమ్మం సభలో తెలుగుదేశం జెండాలు కనిపించినప్పుడే అర్థమైంది. ఆనాడు చంద్రబాబు కూడా ఇలానే మాట్లాడిండు. అలా మాట్లాడిన బాబును పాతాళలోకానికి ప్రజలు పాతరేశారు.’’ అని జగదీష్‌రెడ్డి గుర్తు చేశారు.

‘‘చంద్రబాబు వైఖరినీ రాజకీయంగా కేసీఆర్ ఎదుర్కొన్నారు. తప్పా వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. కేసీఆర్ కాలి గోటికి రేవంత్ రెడ్డి సరిపోడు. కేసీఆర్ స్థాయికి.. రేవంత్ రెడ్డి గడ్డి పోసతో సమానం. కేటీఆర్‌పై సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తే ఇంత వరకు చర్యలు లేవు’’ అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)