Breaking News

పొంగులేటి బాంబుల కామెంట్స్‌.. జగదీష్‌రెడ్డి కౌంటర్‌

Published on Tue, 10/29/2024 - 13:31

సాక్షి,హైదరాబాద్‌:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ బాంబుల కామెంట్స్‌పై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీమంత్రి జగదీష్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై జగదీష్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మంగళవారం(అక్టోబర్‌ 29) మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ బాంబులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్ దోపిడీ బాంబులను అడ్డుకుంటాం. మా హాయాంలో తప్పు జరిగితే విచారణ జరుపుకోవచ్చు.

కాంగ్రెస్ నేతల చిల్లర బెదిరింపులకు భయపడేది లేదు. మంత్రులు చిల్లర మాటలు బంద్ చేసి పాలనపై దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ పోరాటం వల్లే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించింది. పాలన చేతకాకనే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు. ప్రజాస్వామికవాదిగా చెప్పుకునే పెద్దమనిషి ఇప్పుడు ఎక్కడున్నారు? పెద్దమనిషి కాంగ్రెస్ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలీసులే రోడ్డు ఎక్కటం చరిత్రలో ఇది మెదటిసారి.

సీఎం సెక్యూరిటీ నుంచి స్పెషల్ పోలీసులను తప్పించటం అన్యాయం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఆంధ్రకు వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.పండుగల సమయంలో 144సెక్షన్లు పెట్టడం దుర్మార్గం. లోఓల్టేజీ కరెంట్‌తో ఇళ్ళల్లో వస్తువులు కాలిపోతున్నాయి. కమీషన్ రాదన్న కారణంగానే విద్యుత్ శాఖను ప్రభుత్వం గాలికొదిలేసింది. 

కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకోవడానికి రాష్ట్ర ఖజానాను దెబ్బతీస్తున్నారు. కరోనా కాలంలో కూడా తెలంగాణ ఆదాయం తగ్గలేదు.‌ఇప్పుడెందుకు తగ్గింది? పేదలకు చెందాల్సిన ఆదాయం మంత్రులు,కాంగ్రెస్ నేతలు తింటున్నారు. తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చింది కేసీఆర్. రైతులకు కూడా 24గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. కాంగ్రెస్ అంటే ఏంటో ప్రజలు,రైతాంగానికి అర్థమైంది. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. పత్తిని కొనుగోలు చేయాలి.నాణ్యత లేని గుజరాత్ పత్తికి ఎక్కువ ధర ఇస్తున్నారు’అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. 

ఇదీ చదవండి: సమస్యలు కొనితెచ్చుకుంటున్న తెలంగాణ సీఎం

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)